Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పానీ పూరీ అమ్మిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... వీడియో ఇదిగో!

Mamata Banarjee made Puchka in Darjeeling
  • డార్జిలింగ్ లో మమతా బెనర్జీ పర్యటన
  • గూర్ఖాలాండ్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చిన దీదీ
  • మాల్ రోడ్డులోని ఓ పానీ పూరీ దుకాణం సందర్శన
  • సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం ఎగబడిన జనాలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ డార్జిలింగ్ లో పర్యటించారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ) సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్ కు వచ్చారు. మమతా బెనర్జీ పర్యటన మూడ్రోజుల పాటు కొనసాగనుంది. 

కాగా, తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్ లోని మాల్ రోడ్ లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ విక్రయించారు. దాంతో సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.
Mamata Banerjee
Pani Puri
Puchka
Darjeeling
West Bengal

More Telugu News